Thursday, May 2, 2024

నిందితులను గుర్తించుటకు అత్యాధునిక సిసి కెమెరాల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : జాతీయ రహాదారిపై జరిగే రోడ్డు ప్రమాదాలు, వివిధ ఆర్థిక నేరాలలో నిందితులను గుర్తించుటకు అత్యాధునిక సిసి కెమెరాలనుఏర్పాటు చేసినట్లు ఎస్పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో 36 సిసి కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిసి కెమెరాల పని తీరును పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నూతన టెక్నాలజీ గల సిసి కెమెరాలను సదాశివనగర్‌లో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సిసి కెమెరాల ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని సిసి కెమెరా లు ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలు గాని దోపిడీలు, రోడ్డు ప్రమాదాల సమయంలో నేరస్థులను గుర్తించడానికి సులువుఅవుతుందని చెప్పారు.

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు భద్రత కల్పించడానికి మరింత సౌకర్యంగా తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుకు నూతన వాహనాలను ఇచ్చిందని తెలిపారు. వాహన దారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనలు నడపాలని కోరారు. అతివే గం, మద్యం సేవించి వాహనం నడుపడం, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లాంటి ప్రయాణాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటుంన్నారని అన్నారు. రోర్డును నాగరికతకు చిహ్నంగా ఆయన పేర్కొన్నారు. నిర్లక్షంగా వాహనాలు నడిపి ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు.

ప్రజలు ట్రాఫిక్ నిభందనలు పాటిస్తు పోలుసులకు సహకరించాలని కోరారు. సిసి కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తూ పోలీసులకు సహకరిస్తున్న సదాశివనగర్ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, విడిసీ చైర్మన్ కుమ్మరి రాజయ్యని అభినందించి సన్మానించారు. సదాశివనగర్ మండల కేంద్రంలో సిసి కెమెరాల కోసం సహకరించిన రైస్ మిల్లులు బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీమన్నారాయణ ఇండస్ట్రీస్, పద్మావతి ఇండస్ట్రీస్, యంబిఆర్ బ్రిక్స్ యజమానులకు ఎస్పి శ్రీనివాస్ రెడ్డి శాలువాలతో సన్మానించి అభినందించారు. మూడు సంవత్సరాల వరకు సిసికెమెరాల ఏర్పాటుకు సహకరించి దాతలే వాటి నిర్వహణ బాద్యతలు తీసుకోవాలని సూచించారు. ట్రాక్టర్ యజమానులు, కిరాణ దుకాణదారులు సైతం సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రామన్, ఇన్‌స్పెక్టర్ బంటు రాజేష్, ఏఎస్సైలు గంగాసాగర్, నర్సయ్య, ప్రమీల, విడిసీ కార్యదర్శి దేవదాస్, విండో డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, నాయిని గంగయ్య,సాకలి హన్మాండ్లు, పున్నం రాజయ్య, వార్డు సభ్యులు సంతోష్ రెడ్డి, జగ్గబాలరాజు, మెడెగామ ఉప సర్పంచ్ మచ్చర్ల రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News