Friday, August 8, 2025

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పోలీసులు. రట్టు చేశారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న పది మంది నిందితులను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్‌పి రాజశేఖర్‌రాజు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా మిర్యాలగూడ ప్రాంతంలో రెండుచోట్ల గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ లక్ష్మయ్య సిబ్బందితో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, ఉప్పలపాడు గ్రామానికి చెందిన భూక్య హనుమాన్ నాయక్, సింగార కాటం రాజులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 5 కెజిల 200 గ్రాములు,

మిర్యాలగూడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సోమనర్సయ్య ఆధ్వర్యంలో నరసరావుపేట జిల్లా, కారంపూడికి చెందిన మద్దూరు చంటిని పట్లుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 2 కెజిల 200 గ్రాముల గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు.వీరు గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటుపడి, ఒక గ్రూప్‌గా ఏర్పడి, జల్సాల కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆనంద్‌గురు నుండి గంజాయి కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన షేక్ రియాజ్, మహ్మద్, అర్షత్ అయూబ్, మహమ్మద్ సలీం అక్తర్, మహ్మద్ జునైద్ అతీ, షేక్ అప్రోజ్, కుర్ర సందీప్, మహమ్మద్ సోహెల్, మహమ్మద్ నజీరుద్దీన్, బాబా షేక్ సమీర్, మహమ్మద్ సమీర్, ఖానాపురం శరత్ అనే వ్యక్తులు పరిచయం కాగా, వీరు కూడా గంజాయిని బలిమెల నుండి తీసుకువచ్చి అమ్ముతున్నారు. వారినుండి మిర్యాలగూడకు చెందినవారు గంజాయి కొని ఇతరులకు అమ్ముతున్నారని వెల్లడించారు.ఈ క్రమంలో వీరు రెండు గ్రూపులుగా విడిపోయి బైక్,

కారులో మిర్యాలగూడ పట్టణ పరిధిలో కస్టమర్లకు అందజేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రూరల్, టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుండి కారు, మూడు మోటార్ సైకిళ్లు, 14 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అందులో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.ఈ కేసును ఛేదించిన టూటౌన్ సిఐ సోమ నర్సయ్య, మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ లక్ష్మయ్య, టౌటౌన్ ఎస్‌ఐ రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ యాదగిరిరెడ్డి, కానిస్టేబుల్ కూర బాలకృష్ణ, సిబ్బంది అక్బర్ బాషా, లక్ష్మయ్య, రాజశేఖర్, సమాది వెంకన్న, మహేష్, సైదులు, నాగరాజు, రాములు నాయక్‌ను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News