Sunday, June 23, 2024

త్రివిక్రమ్‌తో మంచి రిథమ్ కుదిరింది

- Advertisement -
- Advertisement -

 Allu Arjun

 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం ఆదివారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌తో ఇంటర్వూ…

అలా పుట్టింది ‘సామజవరగమన…’

ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేలా, పాడుకునేలా ఓ పాట ఉండాలనుకున్నాను. అప్పుడు అనుకోకుండా ఈ చిత్రంలో ఓ సీన్‌కు లవ్ సాంగ్ పడాల్సిన సమయం వచ్చినపుడు తమన్ బ్యాండ్ కల్చర్ గురించి చెప్పాడు. ఎలాంటి సాంగ్ అయితే అందరికీ నచ్చుతుందో, అందరూ ఇష్టపడుతున్నారో ఆ టెంపోలో మనం కూడా అలా చేద్దామని అన్నాడు. అలా త్రివిక్రమ్ ఆ ‘సామజవరగమన’ అనే లిరిక్‌ను ఆయనే క్రియేట్ చేసి తమన్‌తో ట్యూన్ చేసి నాకు వినిపించారు. అలా పుట్టింది ఈ సాంగ్.

సరదాగా చేశా…
మామూలుగా ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ రోల్స్ చేయాలి అంటే చాలా సరదా మూడ్‌లో ఉండాలి. అంటే సీరియస్‌గా ఉండి షాట్ అనగానే వచ్చి సరదాగా చేసి వెళ్ళిపోతే ఆ షాట్ బాగా రాదు. అందుకే నేను ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగానే ఈ క్యారెక్టర్ చేశాను. నా రోల్ కూడా మంచి ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది.

అందుకే ఈ చిత్రం ఎంచుకున్నా…
నేను చేసిన గత మూడు చిత్రాలు సరైనోడు, డీజె, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చాలా సీరియస్ కంటెంట్ కలిగినవి. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ కలిగిన చిత్రం ఒకటి చేయాలనుకున్నాను. అందుకే ‘అల వైకుంఠపురంలో’ చిత్రాన్ని ఎంచుకున్నాను.

మంచి రిథం కుదిరింది…
కొందరు హీరోలు, దర్శకుల మధ్య ఒక రిథం కుదురుతుంది. ఉదారణకు చెప్పాలంటే చిరంజీవి, కోదండ రామిరెడ్డి కలిసి అప్పట్లో అనేక హిట్ మూవీస్ చేశారు. అలాగే త్రివిక్రమ్, నాకు మధ్య మంచి రిథం కుదిరింది.

అందుకే ఈ టైటిల్…
ఈ సినిమా వైకుంఠపురం అనే ఇంటిలోని సభ్యుల మధ్య నడుస్తుంది. అందుకే ‘అల వైకుంఠపురంలో’ అని టైటిల్ పెట్టాము.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపిస్తా…
ఈ సినిమాలో నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే మిడిల్‌క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాను. పూజా హెగ్డే నా బాస్‌గా కనిపిస్తుంది. ఇక నా తండ్రిగా చేసిన మురళీ శర్మకి, నాకు అస్సలు పడదు.

అద్భుతంగా ఫీలవుతున్నా…
మలయాళంలోనూ క్రేజ్ తెచ్చుకోవడాన్ని అద్భుతంగా ఫీలవుతున్నా. అక్కడ నాకు మామూలు గౌరవం లభించలేదు. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను దుబాయ్ తీసుకెళ్లి ఒక గొప్ప పురస్కారాన్ని ఇచ్చారు. దాన్ని అందుకున్న తొలి మలయాళేతర వ్యక్తిని నేను. అలాగే కేరళలో బోట్ రేస్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. దానికి అక్కడి గవర్నర్‌తో పాటు నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడిని నేనే. అది నాకొక్కడికి లభించిన గౌరవం కాదనీ మన తెలుగువాళ్లందరికీ లభించిన గౌరవమనీ నాకు అనిపించింది.

Interview with Allu Arjun
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News