Friday, May 3, 2024

ఆ ఇద్దరి పైనా విచారణ జరిపించాలి: నారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టూరిజం శాఖలో వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయని సిపిఐ నారాయణ ఆరోపణలు చేశారు. మంత్రి, ఎండి కలిసి వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు రావడం కంటే ముందు రోజు టూరిజం శాఖ ఆఫీసులో షార్ట్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందని, మంటల్లో విలువైన పత్రాలు కాలిపోయాయన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల విలువైన టూరిజం భూములను అప్పనంగా లీజుకు ఇచ్చారని నారాయణ ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వం న్యాయ విచారణ జరిగేలా చూడాలని, ఇద్దరిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని భావిస్తున్నామన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి అక్రమాన్ని బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News