Sunday, April 28, 2024

ఇరాన్ మహిళ మాసా అమినికి ఈయూ అరుదైన అవార్డు

- Advertisement -
- Advertisement -

స్ట్రాస్‌బర్గ్: హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టయి, పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ మహిళ మాసా అమినికి మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ఐరోపా సమాఖ్య(ఈయు) ప్రతిష్ఠాత్మక మానవ హక్కుల పురస్కారమైన “సఖరోవ్ ప్రైజ్”కు అమిని ఎంపికైంది. ఈమేరకు యూరోపియన్ పార్లమెంట్ గురువారం ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన కుర్దిష్ మహిళ మాసా అమినిని గత ఏడాది సెప్టెంబరులో హిజాబ్ సరిగా ధరించలేదన్న అభియోగాలపై నైతిక విభాగం పోలీస్‌లు అరెస్టు చేశారు.

వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె చికిత్స పొందుతూ 2022 సెప్టెంబర్ 16న ప్రాణాలు విడిచారు. ఆమె మృతితో ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆందోళన కారులపై భద్రతా బలగాలు అణచివేతకు పాల్పడడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా అమిని మృతికి వ్యతిరేకంగా పోరాడిన కుర్దిష్ మహిళా హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదీని ఇటీవల నోబెల్ శాంతి పురస్కారం వరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News