Monday, May 13, 2024

జెరిఖో వాల్ పత్రాలతో సంచలనం

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పటి యుద్ధానికి దారితీసిన తొలి ఘర్షణల వ్యూహం గురించి ఇజ్రాయెల్‌కు ఏడాది ముందే తెలుసునని ఇప్పుడు వెల్లడైంది. జెరిఖో వాల్ పేరిట ఇప్పుడు సంబంధిత విషయంపై 40 పేజీల వివరాల డాక్యుమెంట్ వెలుగులోకి వచ్చింది. ఇది ఇజ్రాయెల్‌లో హమాస్ మెరుపుదాడుల వ్యూహరచనకు సంబంధించింది. ఇజ్రాయెల్ సైనిక విభాగాలకు , ప్రత్యేకించి ఇజ్రాయెల్ గూఢచార సంస్థకు దీని గురించి ఏడాది ముందుగానే తెలుసునని జెరిఖో డాక్యుమెంట్ల ద్వారా తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. సంబంధిత విషయాలను తెలిపే ఇ మొయిల్స్ ఇంటర్వూలను కూడా ఇందులో ప్రస్తావించారు.

ఈ డాక్యుమెంట్లలో ఉన్నట్లుగానే హమాస్‌బలగాలు ఏ తేదీన దాడికి దిగుతాయి? ఏ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ మెరుపుదాడులకు దిగుతాయనేది ఇందులో పేర్కొన్నారు. దీనిలో ఉన్నట్లుగానే ఇప్పుడు అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడికి దిగడం , పలువురు ఇజ్రాయెలీల ఊచకోతకు దిగడం జరిగింది. మరి దీని గురించి అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్ సైన్యం ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నకు కానీ, ప్రధాని నెతన్యాహుకు దీని గురించి ముందుగా తెలుసునా? అనే దానికి కానీ సరైన సమాధానం వెలువడలేదు. అయితే గాజా చుట్టూ ఉన్న తమ కంచుకోటలను దాటి హమాస్ లోపలికి ప్రవేశించి, మెరుపుదాడులకు దిగే అవకాశం ఉండదని ఇజ్రాయెల్ సేనలు భావించి ఉంటాయని ఇందుకే వారు కిమ్మనలేదని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News