Tuesday, May 14, 2024

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్ 1..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆదిత్యా ఎల్ 1 నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్యా ఎల్ 1 ఉపగ్రహం పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా కక్షలోకి దూసుకువెళ్తుంది. ఆదిత్యా ఎల్ 1 ద్వారా సూర్యుడిపై భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో) పరిశోధనలు చేయనుంది. ఆదిత్యా ఎల్ 1 వ్యోమనౌక 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 4 నెలల కాలంలో ఛేదిస్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

ఇక, సూర్యుడి దిశలో భూమికి 1.5 మిలియన్ కిమీల దూరంలో ఉండే లాగ్రాన్‌జియాన్ పాయింట్ 1 చుట్టూ ఉండే వలయాకారపు కక్షలో ఆదిత్యా ఎల్ 1 విడిది చేస్తుంది. ఆ తరువాత సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇది ఈ పరిభ్రమణాన్ని వలయాకారంలోనే సాగించడం ద్వారా ఎప్పటికప్పుడు సూర్యుడిని అధ్యయనం చేయగల్గుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News