Friday, May 3, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల ఇళ్లలో మూడో రోజు ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు మర్రి జనార్ధన్ రెడ్డి , పైళ్ల జనార్ధన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం నుండి బిఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. భువనగరి, నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయమే ఐటి అధికారులు సోదాలు నిలిపివేశారు. కానీ భువనగిరి, నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎల నివాసాల్లో సోదాలు శుక్రవారం నిర్వహించారు.

నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన వస్త్ర దుకాణాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన ఇతర వ్యాపార సంస్థల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మరో వైపు భువనగిరి ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టబుడులు పెట్టినట్టుగా ఐటి అధికారులు గుర్తించారు ఈ సంస్థల లావాదేవీల గురించి ఐటి అధికారులు ఆరా తీశారు.

ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతుంది. మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీలో ఈ ముగ్గురు భాగస్వామ్యులుగా ఉన్నారనే ప్రచారంలో ఉంది. ఈ సంస్థకు చెందిన పన్ను చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్లను ఐటి అధికారులు పరిశీలించారని చెబుతున్నారు. ఐటి సోదాల తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డి గురువారం ప్రకటించారు. తాను ఇప్పటికే ఐటి శాఖకు రూ. 150 కోట్ల పన్నులు చెల్లించినట్టుగా మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News