Sunday, April 28, 2024

31 లక్షల మందికి నో ఐటి రీఫండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చాలా మంది పన్ను చెల్లింపుదారులు గడువుకు ముందే ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అసెస్‌మెంట్ సంవత్సరం(2022-23) ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. కానీ వారు ఇవెరిఫై చేయడం మరిచిపోయారు. ఆగస్టు 23 నాటికి పన్ను చెల్లింపుదారులు దాదాపు 31 లక్షల మంది ఇవెరిఫై చెయలేదని ఐటి శాఖ వెల్లడించింది. ఐటి శాఖ నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారులందరూ తమ ఐటిఆర్‌ని 30 రోజుల్లో ధృవీకరించడం తప్పనిసరి, పన్ను చెల్లింపుదారుపన్ను రిటర్న్‌ను ధృవీకరించకపోతే, ఐటిఆర్ ప్రాసెస్ జరగదు. ఈ పరిస్థితిలో ఈ పన్ను చెల్లింపుదారులు మళ్లీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ప్రకారం, ఆగస్టు 23 వరకు 6.91 కోట్ల మందికి పైగా ప్రజలు రిటర్న్‌లు దాఖలు చేశారు. అయితే 6.59 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఐటిఆర్‌ల ధృవీకరణ చేపట్టింది. మిగిలిన 31 లక్షల రిటర్న్‌లు వెరిఫై చేయలేదు.

దీనిలో కొంతమంది పన్ను చెల్లింపుదారులకు ధృవీకరణ కోసం 30 రోజుల సమయం ఉంది, ఇది త్వరలో ముగుస్తుంది. వీలైనంత త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఈ వ్యక్తులను అప్రమత్తం చేసింది. బుధవారం ప్లాట్‌ఫామ్‌లో చేసిన ట్వీట్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఐటిఆర్‌ను 30 రోజుల్లోగా ధృవీకరించాలని, లేకపోతే మళ్లీ రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని, దీని కోసం ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటిఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీని జూలై 31న ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దీని తర్వాత ఆలస్యమైన ఐటిఆర్ దాఖలుకు రుసుము చెల్లించాలి. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ. 1000 చెల్లించాలి. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News