న్యూఢిల్లీ: ఒకప్పటి ప్రముఖ హిందీ నటి, సమాజ్ వాదీ ప్రముఖ నేత జయాబచ్చన్, కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి అండగా రంగలోకి దిగారు. ‘సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేదు. ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?’ అని జయాబచ్చన్ బిజెపి వారిని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఓ సమర్థ నాయకురాలని కూడా జయాబచ్చన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సోనియా గాంధీతో నిన్న పార్లమెంటులో బిజెపి నాయకులు వ్యవహరించిన తీరు సరిగా లేదని, చాలా సిగ్గుమాలిన విధంగా వారు వ్యవహరించారన్నారు. ఎన్నడూ కూడా ఇలా అధికార పక్షం వారు వ్యవహరించినట్లు చూడలేదన్నారు. సోనియా గాంధీ ఓ సీనియర్ నాయకురాలని జయాబచ్చన్ అన్నారు. బిజెపి వాళ్లు ద్వంద్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని జయ ఆక్షేపించారు. చాలా తప్పు జరుగుతోందన్నారు. సోనియా గాంధీ విషయంలోనే కాదు ఏ మహిళ విషయంలోనూ ఇలా దుర్వ్యవహారం ఉండకూడదన్నారు. బిజెపి నాయకురాలు రమాదేవితో మాట్లాడటానికి సోనియా గాంధీ వెళితే తప్పేమిటి? తాము(ఎంపీలు) అందరితో మాట్లాడుతుంటామని తెలిపారు.
सोनिया गांधी के समर्थन में उतरीं #JayaBachchan, बोलीं "ये लोग सारी परम्पराएं लांघ गए हैं… #SoniaGandhi वरिष्ठ नेता हैं, उनको क्यों परेशान कर रहे हैं। सब जानते हैं कि उनकी तबियत ठीक नहीं है। किसी महिला के साथ इस तरह का दुर्व्यवहार नहीं करना चाहिए"#ReporterDiary (@Supriya23bh) pic.twitter.com/fJDhXnkli0
— AajTak (@aajtak) July 29, 2022