Sunday, April 28, 2024

వచ్చే వారం భారత్‌కు జెఫ్ బెజోస్

- Advertisement -
- Advertisement -

Jeff-Bezos

న్యూఢిల్లీ: అమెజాన్ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పరిశ్రమ నాయకులతో సమావేశం కానున్నారు. ఈమేరకు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 1516 తేదీల్లో రాజధానిలో జరిగిన చిన్న, మధ్యతరహా వ్యాపారాల కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై అమెజాన్‌ను మీడియా సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.

ప్లాస్టిక్ నియంత్రణలో మొదటి మైలురాయి

ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలోని ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్(ఎఫ్‌సి)ల నుంచి ఒకసారికి మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉన్న ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో మొదటి మైలురాయిని సాధించామని ప్రకటించింది. అన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో ప్లాస్టిక్ డన్నేజ్ బదులుగా పూర్తి స్థాయిలో పేపర్ కుషన్లను ఉపయోగించనుంది. ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకుంటోంది. జూన్ 2020నాటికి ప్లాస్టిక్ ను పూర్తిగా నియంత్రిస్తామని కంపెనీ సెప్టెంబర్ 2019న ప్రకటించింది.

Jeff Bezos to visit India next week

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News