Tuesday, April 30, 2024

స్పేస్‌లోకి వెళ్లే మొదటి భారతీయ పౌరుడితడే

- Advertisement -
- Advertisement -

గోపీచంద్ తోటకూరకు బెజో కంపెనీ ఛాన్స్
స్పేస్‌లోకి వెళ్లే మొదటి భారతీయ పౌరుడితడే
బెజవాడ బాబు సాహసాలలో టాప్

న్యూయార్క్ : తొట్టతొలి తెలుగుతేజం అంతరిక్షానికి సాగనుంది. తెలుగువాడైన గోపిచంద్ తోటకూర త్వరలో జరిగే అమెజాన్ న్యూ షెపార్డ్ అంతరిక్ష యాత్రలోని ఆరుగురు సభ్యుల బృందంలో ఒకరిగా ఎంపిక అయ్యారు. త్వరలోనే ఈ ప్రయోగం జరుగుతుంది. ప్రఖ్యాత వ్యాపారవేత్త జెఫ్ బెజో స్థాపిత స్పేస్ కంపెనీ బ్లూ ఒరిజిన్ ద్వారా సాగే అంతరిక్ష ప్రయాణానికి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యోమగాములను ఎంపిక చేశారు. వీరిలో ఒకరుగా తెలుగు యువకుడు గోపిచంద్‌ను కూడా బృందంలో ఒకరిగా ఖరారు చేశారు.

ఈ కంపెనీ అంతరిక్ష యాత్ర తేదీలను ఇంకా వెల్లడించలేదు. అయితే వ్యోమగాములకు అవసరం అయిన శిక్షణను ఇప్పటికే అందిస్తున్నారు. ఈ తెలుగువాడు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఈ యాత్ర పూర్తి అయితే ఇక అంతరిక్షంలో ప్రయాణించే తొలి భారతీయ వ్యోమగామి ఘనత గోపీచంద్‌దే అవుతుంది. కాగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయ పౌరుడు కూడా ఆయనే అవుతారు.

1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తరువాత రాజాచారి, శిరీష బండ్ల, సునీత విలియమ్స్, కల్పనా చావ్లాలు భారతీయ సంతతికి చెందిన వారే వీరు కూడా వ్యోమగాములుగా వెళ్లారు. అయితే వీరంతా అమెరికా పౌరులు . భారతీయ పౌరుడు, వ్యోమగామి ఘనత ఈ తోటకూరిదే అయింది. ఇప్పటికైతే ఈ బ్లూ ఒరిజన్ వారి అంతరిక్ష నౌక ఎన్‌ఎస్ 25 సబ్‌ఆర్బిటల్ మిషన్ తేదీలు ఖరారు కాలేదు. అయితే వచ్చే కొద్ది వారాలలో దీనిని చేపట్టేందుకు విస్తృత స్థాయిలో సన్నాహాలు చేపట్టారు.

తోటకూర గోపీచంద్ విజయవాడ జన్మస్థలం
30వ ఏట అంతరిక్ష ఘనత దక్కిన సాహసి
30 సంవత్సరాల గోపీ విజయవాడలో జన్మించారు. అతి చిన్న వయస్సులోనే రోదసీకి వెళ్లే లక్కు కొట్టేశాడు. అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయన తన భారతీయ పౌరసత్వ పాస్‌పోర్టు కొనసాగిస్తున్నారు. ఆయన ఎంబ్రీ రిడ్లె ఎరోనాటికల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయెట్ అని బ్లూ ఒరిజన్ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఆయన సాహసి, జీవితాంత ప్రయాణ సాహస విన్యాసి, ఇటీవలే ఆయన మౌంట్ కిలిమంజరో శిఖరానికి చేరుకుని సాహస వీరుడు అన్పించుకున్నాడని, ఇప్పుడీ అరుదైన అవకాశం పొందాడని కంపెనీ వర్గాలు స్పందించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News