Tuesday, April 30, 2024

ధోతీ కుర్తా.. మెడలో రుద్రాక్ష

- Advertisement -
- Advertisement -

కాశీ ఆలయం వద్ద ఖాకీ డ్రస్సు ఇదే
కొత్త నిబంధన అమలులోకి
యోగి సర్కారు నిర్ణయం
ఏ మాన్యువల్ ఇదని నిరసనలు
యోగి సర్కారు యాగి అన్న అఖిలేష్

వారణాసి : ప్రముఖ పుణ్యక్షేత్రం, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రస్ కోడ్ విధించింది. ఇకపై ఇక్కడ సంరక్షక బాధ్యతలలో ఉండే వారు విధిగా భక్తుల సాంప్రదాయక ధోవతి, కుర్తా, ఇందులోనూ కాషాయ వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.మెడలో విధిగా రుద్రాక్ష మాలలు వేసుకోవాలి. ఇటీవల ఈ ఆలయ ప్రాంగణంలో పోలీసులు ధోతీ కుర్తా వస్త్రాలలో కలియతిరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులు కంగుతిన్నారు.

దీనిపై వారణాసి నగర పోలీసు కమిషనర్ మెహిత్ అగర్వాల్ ఆదేశాలు వెలువరించారు. పోలీసులు ఇక్కడ ఇకపై సాధారణ పోలీసు ఖాకీ దుస్తులలో కాకుండా కేవలం ఈ ధోతీ కుర్తా వస్త్రధారణతోనే విధులు నిర్వర్తించాలని నిర్ణయించినట్లు తెలిపారు.అన్ని విషయాలను , ప్రత్యేకించి ఇక్కడి పరిసరాల పవిత్రత పరిరక్షణను పరిగణనలోకి తీసుకుని ఈ డ్రస్‌కోడ్ అమలులోకి తీసుకువచ్చినట్లు అగర్వాల్ విలేకరులకు తెలిపారు. ఇక్కడికి తరలివచ్చే లక్షలాది మంది యాత్రికులను అదుపాజ్ఞలలో పెట్టేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నారని వివరించారు. ఇక్కడికి వచ్చే వారి మదిలో ప్రశాంతత క్రమంలో వీరికి ఈ డ్రస్‌కోడ్ పెట్టినట్లు తెలిపారు.

అంతటా భక్తిభావం ఏర్పడేందుకు, తమ ముందు సాధారణ భక్తుల మాదిరిగా ఉండే పోలీసులకు తమ సాధకబాధకాలు తెలియచేసుకునేందుకు ఈ విధానం ప్రవేశపెట్టామని సమర్థించుకున్నారు. ఇక్కడికి వచ్చే వారికి తమ యాత్ర పట్ల పరిపూర్ణ ప్రశాంతత ఏర్పడేందుకు, ఈ భావనతోనే తిరిగి వెళ్లేందుకు వీలేర్పడుతుందన్నారు. సాధారణంగా ఇక్కడ విధులలో ఉండే పోలీసులు దురుసుగా ఉంటారని, నెట్టివేస్తుంటారని ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందుతాయని , అయితే ఇప్పుడు పూజారుల మాదిరిగా కన్పించే పోలీసులు వారి పట్ల మర్యాదగా ఉంటారు. పైగా ప్రజలకు కూడా వీరికి తమ బాధలు తెలియచేసుకునేందుకు వీలుంటుందని చెప్పారు.

కేవలం కాశీ ఆలయ గర్భగుడి వెలుపలే ఈ ఏర్పాట్లు చేశారు. ఇంతవరకూ ఉన్న ఫిర్యాదుల సమస్య ఇక పరిష్కారం అవుతుందని భావిస్తున్నామని తెలిపారు. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ విమర్శలకు దారితీసింది. ఏ పోలీసు మాన్యువల్ ప్రకారం ఇటువంటి పద్థతికి దిగారని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఇటువంటి చర్యకు దిగిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త పద్ధతిని ఆసరాగా తీసుకుని ఇకపై ఎవరైనా ఈ దుస్తులలో వచ్చి పోలీసులుగా తెలియచేసుకుని లూఠీలకు , మోసాలకు పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు. యోగి ప్రభుత్వం జవాబుదారి అవుతుందా? అని నిలదీశారు. రానురాను యోగి సర్కారు తీరు మితిమీరుతోంది. ఇప్పటి నిర్ణయం గర్హనీయం అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News