Thursday, May 2, 2024

రియల్టర్ హత్య కేసులో కొత్తకోణం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రియల్టర్ హత్య కేసు లో కొత్తకోణం వెలుగులో కి వచ్చింది. ఈ కేసులో తల్లీ, కూతురు ప్రధాన నిందితులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బున్న పెద్ద మనుషులని ట్రాప్ చేసి దోచుకుంటున్న తల్లి కూతు ర్లు. వ్యభిచారం నిర్వహిస్తున్న హిమాంబీపై నగరంలో ని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తన వద్దకు వచ్చే బడాబాబులను ఆకర్షించేందుకు హి మాంబీ తన కూతురు నసేమాను ఎరగా వేసి పుట్టా రాము అలియాస్ సింగోటం రామును తొంగదీసుకుం ది. తన కూతురిని ఎరగా వేసిన హిమాంబీ రాము వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు కొట్టేసింది. వారి మా యలో పడిన రాము లక్షలాది రూపాయలు ఇచ్చాడు. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాములు ఇటీవలి కాలంలో హిమాంబీపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో రాముపై హిమాంబీ కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే రాము సింగోటం ప్రత్యర్థులు హిమాంబీని సంప్రదించి రామును హత్య చేసే ప్లాన్ వివరించారు.

దీనిలో భాగంగా హిమాంబీ మణికంఠ వద్ద డబ్బులు తీసుకుని హనీ ట్రాప్ చేశారు. నసీమాతో ఫోన్ చేయించి రామును ఇంటికి పిలిపించారు. నసీమాపై అప్పటికే రాము కన్ను ఉండడంతో వారు పిలిచిన వెంటనే ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న వారి ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడే ఉన్న ప్రత్యార్థులు రాముపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. గతంలోనూ పలువురిని ఇదే విధంగా హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల వి చారణలో వెల్లడైంది. అంతేకాకుండా హిమాంబీ ఎల్‌ఎన్ నగర్‌లో ఉంటున్న ఇంటిని విక్రయించినా కూడా ఖాళీ చేయకుండా కొనుగోలు చేసిన యజమానిపై కే సులు పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తోంది. తను విక్రయించిన ఇంటిని తిరిగి వెనక్కి రాయాలని కొనుగోలు చేసిన వ్యక్తిపైకి తన కూతురుని ఎరగా వేసింది. అయినా ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి వినకపోవడంతో రెం డు కేసులు నమోదు చేయించినట్లు తెలిసింది. తాజా ఘటనల నేపథ్యంలో హిమాంబీ, ఆమె కూతురుతో స హా ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News