Monday, May 6, 2024

ఎసిబికి అడ్డంగా దొరికిన జూబ్లీ హిల్స్ ఎస్‌ఐ.. పరారీలో సిఐ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఎస్‌ఐ సుధీర్ రెడ్డి ఎసిబి అధికారులకు అడ్డంగా పట్టుబడ్డాడు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసులో భాదితుడుకి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, లోక అదాలత్ లో కాంప్రమైజ్ చేయడానికి సిఐ బలవంతయ్య ఆదేశాలతో ఎస్ఐ సుధీర్ రెడ్డి రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆ డబ్బులను తీసుకోవడానికి ఎస్ఐ తన కొడుకుని మధ్యవర్తిగా నియమించాడు. సమాచారం అందుకున్న ఎసిబి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి ఎస్ఐని, తన అన్న కొడుకుని పట్టుకున్నారు. వారి నుంచి రెండు వ్యాట్ 69 మద్యం బాటిల్స్, రూ.50 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సిఐ బలవంతయ్య పరారయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన అన్ని కాల్ రికార్డ్స్ ఆధారాలు తమవద్ద ఉన్నాయని, పరారీలో ఉన్న సిఐని త్వరలోనే అరెస్టు చేసి విచారుస్తామని ఎసిబి అధికారులు తెలిపారు.

Jubilee Hills SI Sudheer Reddy in ACB Net

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News