Thursday, May 2, 2024

రాజీవ్ గాంధీని ముందే హెచ్చరించిన కంచి స్వామి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని దివంగత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) టిఎన్ శేషన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన మరణానంతరం ఈ పుస్తకం ఈ వారం ప్రచురణ జరిగింది.

రూపా ప్రచురణ సంస్థ ప్రచురించిన శేషన్ ఆత్మకథ త్రూ ది బ్రోకెన్ గ్లాస్(పగిలిన అద్దం నుంచి) ;I పుస్తకంలో రాజీవ్ గాంధీ హత్యకు వారం రోజుల ముందే ఆయనకు కాంచీపురం శంకర మఠం నుంచి రాజీవ్‌ను జాగ్రత్తగా ఉంమని చెప్పాలంటూ ఒక సందేశం వచ్చిందని పేర్కొన్నారు. 1991 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తుండగా రాజీవ్ గాంధీ హత్య జరిగింది.

టిఎన్ శేషన్ తన ఆత్మకథలో ఇలా రాశారు. 1991 మే 10న పగలు నేను రాజీవ్ గాంధీని కలుసుకున్నాను. అజెండా అంటూ ఏమీ లేదు. నా ఆందోళనను తెలియచేయడానికి వ్యక్తిగతంగా ఆయనను కలుసుకున్నాను. దానికి రాజీవ్ గాంధీ పగలబడి నవ్వుతూ బదులిచ్చారు. నేను రెండుసార్లు చావను అంటూ ఆయన నవ్వారు. సెక్యూరిటీ లేకుండా స్వేచ్ఛగా ప్రచారంలో పాల్గొంటున్న ఆయనను జాగ్రత్తగా ఉండాలని మరోసారి హెచ్చరించాను. అయినా ఆయన వినిపించుకోలేదు. మే 14న రాజీవ్ గాంధీని జాగ్రత్తగా ఉండాలని చెప్పాలంటూ కాంచీపురం శంకర మఠం నుంచి నాకు ఒక సందేశం వచ్చింది&అని శేషన్ పేర్కొన్నారు.

నేను హెచ్చరించినప్పటికీ రాజీవ్ గాంధీ తేలికగా తీసుకుంటున్నారని కంచి పీఠాధిపతికి తెలియచేశాను. ఇందుకు సంబంధించి రాజీవ్‌కు నేరుగా ఫ్యాక్స్ సందేశం పంపించాను. అది ఆయన టేబుల్ మీదకు మే 17న చేరుకుంది. కాని, దాన్ని ఆయన చదివేనాటికే మే 21న శ్రీపెరంబుదూరులో బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ మరణించారు అని శేషన్ తన ఆత్మకథలో తెలిపారు.

1990లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వేషన్ జాతకాల పట్ల ఉన్న ఆసక్తితో రాజీవ్ గాంధీ జాతకంలోని గ్రహాల సంచారాన్ని బట్టి ఆయనకు ముంచుకొస్తున్న ఆపదను గురించి హెచ్చరించినట్లు తన ఆత్మకథలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News