Sunday, November 3, 2024

కోలీవుడ్ లో విషాదం.. ‘కంగువ’ ఎడిటర్‌ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ లో విషాదం నెలకొంది. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ ప్రాజెక్టు కంగువ సినిమా ఎడిటర్ నిషాద్‌ యూసుఫ్‌(43ఏ) కన్నుమూశారు. చెన్నైలోని తన ఇంట్లో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. కంగువ మేకర్స్ తోపాటు సినీ ప్రముఖులు నిషాద్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తుట్లు తెలిపారు. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా, కంగువ మూవీ నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ సహా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అంతేకాదు, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని, కోలీవుడ్ నుంచి మొదటి రూ.వెయ్యి కోట్ల సినిమాగా కంగువ నిలవనుందని మేకర్స్ అందరూ సెలబ్రేషన్ మూడ్ లో ఉండగా.. ఈ సినిమా ఎడిటర్ మృతి చెందడం విషాదాన్ని నింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News