Sunday, April 28, 2024

ప్రపంచానికే ఆదర్శం కంటి వెలుగు

- Advertisement -
- Advertisement -

ప్రజల ‘కంటి వెలుగు’ ముఖ్యమంత్రి కెసిఆర్. World largest eye screening programme గా నభూతో నభవిష్యత్ అన్నట్లు మహా యజ్ఞంలా ప్రపంచ చరిత్ర సృష్టించడానికి కంటి వెలుగు కార్యక్రమం ముందుకు సాగుతుంది. తెలంగాణలో గురువారం నాటికి కోటి కంటి వెలుగు పరీక్షలు పూర్తయ్యాయి. ఇదొక అద్భుతమైన కార్యక్రమం చరిత్ర సృష్టించింది. ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు కోటి మార్క దాటడం మరో మైలరాయిగా నిలిచింది. మంగళవారం నాటికి 99 లక్షల 81 వేల 133 మంది కంటి పరీక్షలు చేయించుకోగా ఈ కార్యక్రమం గురువారం నాటికి కోటి పరీక్షలు పూర్తయ్యాయి. దగ్గర చూపుతో ఇబ్బంది పడుతున్న వారికి ఇచ్చిన రీడింగ్ గ్లాసెస్ 16 లక్షల 50 వేలు కాగా, దూరం చూపుతో ఇబ్బంది పడుతున్నవారు 12 లక్షల 50 వేలు ప్రిస్క్రిన్ గ్లాసెస్ అందిస్తున్నారు. అవ్వ అయ్యలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములను కంటి వెలుగు ద్వారా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత కెసిఆర్ తీసుకున్నారు.

ఇవి ఎన్నికల కోసం అంటూ వాగే వాళ్లకు చెంప చెళ్లుమనిపించిన కార్యక్రమం కంటి వెలుగు. వృద్ధాప్యం వచ్చిందంటే తల్లిదండ్రులకు ఉండే కష్టాలు మామూలు కాదు. బిడ్డ సరిగా కండ్లు కనిపిస్త లేవురా అంటే చూపించరు. బీడీలు చుట్టే అక్కచెల్లెళ్ల పరిస్థితి కూడా దయనీయం. ఒక వైపు బీడీలు చుడుతుంటే కండ్లు సరిగా కనిపించక వారు పడే బాధలు అంతఇంతా కాదు. అనేక వర్గాల ప్రజలు కంటి సమస్యలతో బాధపడేవారు లక్షలాది మంది ప్రజలు ఉంటారు. నిత్యం ఏదో పని చేసుకునే జీవితం నెట్టుకొచ్చే పేద వాళ్లకు కంటి సమస్య వస్తే ఏ పని చేసుకోలేరు. చాలా మంది తమ తల్లదండ్రులకు కంటి పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏ పోదాం తీ అవ్వ, అయ్య అంటూ కాలయాపన చేయడం జరుగుతుంది. కంటి పరీక్షలు చేసుకుందామంటే వృద్ధులు, మహిళలు అనేక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ప్రైవేట్ దవాఖానాకుపోతే వేలల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు.

ఇలాంటి తరుణంలో గొప్పగా ఆలోచించి మానవీయ కోణంలో నేడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పేద ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు నింపిండు. 2018లో ఒక్కసారి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు 8 నెలల పాటు కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం మొన్న జనవరి 18న ఖమ్మంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో సిఎం కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు.
ఇటువంటి కార్యక్రమం దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చేయలేదు. తెలంగాణలో సిఎం కెసిఆర్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో కూడా కంటి వెలుగు కార్యక్రమం చేపడతామని పలువురు సిఎంలు మన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఇది కెసిఆర్ మానవీయత, మమకారం. ఆప్యాయత. ప్రేమ. ఓట్లు, సీట్లు కోసం కాదు. ప్రజలను కాపడుకునే ధర్మం మాది అంటూ.. ప్రజలను కాపాడుకోవాలి. వారి బాధలు తీర్చే బాధ్యత మాది. ప్రజలు బాగుండాలి ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ తపన. కండ్లు కనిపించకపోతే జీవితమే చీకటి ప్రపంచంలా ఉంటుంది. దృష్టి లోపంతో బాధ.. చిన్న సమస్యే వదిలేయడం వల్ల కాలం గడిచే కొద్దీ అది పెద్ద సమస్య అవుతుంది.

ఇందుకు పరిష్కారంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమానికి సంకల్పానికి శ్రీకారం చుట్టారు. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యం నినాదంతో ముందుకు వెళుతుంది. కంటి వెలుగు కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతున్నది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 50 రోజుల్లో వరకు ‘కోటి’ మందికి పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రుల వద్దకు పోవడం కాదు. ప్రజల దగ్గరికే ప్రతి పల్లె, పట్టణాలకే ప్రభుత్వ ఆసుపత్రి కదిలి వచ్చి కంటి వెలుగు నిచ్చింది. గ్రామాల్లో, పట్టణాల్లో మున్సిపల్ వార్డుల కేంద్రంగా ఈ కంటి వెలుగు శిబిరాలతో గడప గడపకు కార్యక్రమం చేరింది. కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అవసరం అయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది జనవరి 18 నుండి ఏప్రిల్ 6 వరకు చేసిన కంటి పరీక్షల సంఖ్య కోటి మార్కుకు చేరుకున్నది. ఇది కోటి మార్కు దాటడంలో సదాశివపేట పట్టణంలో రికార్డు నమోదైంది.

ఇంత గొప్ప కార్యక్రమాన్ని దీవించారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. పండుగలా కంటి వెలుగు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 7 వేల గ్రామాల్లో, 2 వేల 339 వార్డుల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా మిగతా గ్రామాలు, పట్టణాల్లో మరో 50 రోజుల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప సంకల్పానికి.. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విజయవంతంగా ముందుకు తీసుకేళ్లుతున్నారు. నిరంతరం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కంటి వెలుగు కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకున్నారు. ఈ రోజు కోటి మార్క్‌ను దాటమంటే మంత్రి హరీశ్ కృషికి నిదర్శనం. కంటి వెలుగు కార్యక్రమంలో పాలు పంచుకున్న వైద్య బృందం, సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, అంగనివాడీ టీచర్లు, ఆర్పీ కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆయా విభాగాల అధికారులు కంటి వెలుగు కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి ఎంతో శ్రమించారు. కోటి మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో పురుషులు 47 లక్షలు , స్త్రీలు 53 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇంటికి వెళ్లి కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహణ జరుగుతున్నది.

ఈసారి 1500 వైద్య బృందాలు కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం రూ. 250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా 950 మంది వైద్యులను కొత్తగా తీసుకున్నది. కంటి వెలుగు సమయం లో ఇతర వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం కలుగకుండా బఫర్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవ్వ, అయ్యలు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ మా ఇంటి పెద్ద కొడుకు సల్లంగా ఉండాలని అవ్వ అయ్యలు దీవిస్తున్నారు. ఇప్పుడిక ఈ కంటి వెలుగు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఈ దిశగా మంత్రి హరీష్ రావు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం. ప్రజల బాగోగులుచూసే ప్రభుత్వం. అందుకే తెలంగాణ కంటి వెలుగు దేశానికి వెలుగు ఆదర్శంగా నిలిచింది. దేశం ‘కంటి వెలుగు’ నాయకుడు కెసిఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటుంది.

చిటుకుల మైసారెడ్డి, 9490524724

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News