Thursday, May 2, 2024

కర్నాటక ఎన్నికలు: ప్రియాంక గాంధీ, అమిత్ షాల విస్తృత ప్రచారం

- Advertisement -
- Advertisement -
అంతర్గత సర్వేలు, బిజెపిలో తిరుగుబాటుతో బలంపుంజుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ దగ్గర పడుతున్నాయి. మరో పక్షం రోజుల్లో అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తన పార్టీ బిజెపి తరఫున ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రియాంక గాంధీ దక్షిణ కర్నాటకపై, అమిత్ షా ఉత్తర కర్నాటకపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవలే హవేరి జిల్లాలోని హంగల్ పట్టణంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తూ బిజెపికి 40 సీట్లకు మించి ఇవ్వొద్దని ఓటర్లను కోరారు. బిజెపిలో తిరుగుబాటు, సర్వేలు కాంగ్రెస్‌కే అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ నూతన ఉత్తేజంతో దూసుకుపోతోంది. తిరిగి అధికారంలోకి వస్తానని నమ్ముతోంది. కర్నాటకలో విజయంతో 2024నాటి లోక్‌సభ ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాలనుకుంటోంది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ మైసూరు, ఛామరాజ్‌నగర్ జిల్లాలో ప్రచారం చేస్తున్నారు.

మైసూరు జిల్లాలోని వరుణ సీటులో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, గృహశాఖ సహాయ మంత్రి వి.సోమన్న నువ్వా, నేనా అన్న రీతిలో తలపడుతున్నారు. సోమన్న ఛామరాజ్‌నగర్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు.

ప్రియాంక గాంధీ టి.నరసిపూర్‌లోని యలవరహుండీలో పబ్లిక్ ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత ఆమె ఛామరాజ్‌నగర్‌లోని హనూర్ టౌన్‌లో ఉన్న గౌరీశంకర్ హాల్‌లో మహిళలతో మాటామంతీ జరుపనున్నారు. తరువాత సాయంత్రం కె.ఆర్.నగర్ నియోజకవర్గంలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం విజయపుర, బాగల్‌కోట్, యాద్గిర్ జిల్లాలో ప్రచారం చేయనున్నారు. యాద్గిరిలో రోడ్ షోలో కూడా పాల్గొననున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం విజయపుర సమావేశంలో పాల్గొననున్నారు. ఆయన పబ్లిక్ ర్యాలీల్లో పాల్గొనడమే కాకుండా, మఠాలను కూడా సందర్శించనున్నారు.

Amit Shah

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News