Monday, April 29, 2024

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ హోలీ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అని పేర్కొన్నారు. హోలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని వ్యాఖ్యానించారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కెసిఆర్ ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News