Monday, May 13, 2024

తండాలను అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తండాలను అభివృద్ధి చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే అని తెలంగాణలో జనాభా దమాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్ 6నుంచి 10శాతానికి పెంచడం ద్వారా గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్‌ఎస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలంలోని అచ్చమ్మకుంటతండాలో రూ.20లక్షలు, గన్యనాయక్‌తండాలో రూ.20లక్షల అభివృద్ధి పనులు, సూర్యతండాలో రూ .20లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ముందుగా ఆయా గ్రామాల్లోని మహిళలు కోలాట ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా గ్రామాలకు తె లంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు వచ్చిన అభివృద్ధి నిధులు, జరిగి న అభివృద్ధి తదితర వివరాలను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో గిరిజనుల అస్థిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు.

తండాలను, ఆదివాసి గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో వాటన్నింటికి ఒక్కొక్క జీపీ భవనాలకు రూ.20లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్త్రంలోని అన్ని తండాలకు సుమారు రెండు వేల కోట్లతో బిటి రోడ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటి సి మారుపాకుల అరుణసురేష్‌గౌడ్, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు టివిఎన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు నేనావత్ శ్రీనునాయక్, నేనావత్ లోచన్‌సింగ్, కశిరెడ్డి రవీందర్‌రెడ్డి, క డారి సైదులు, స్థానిక సర్పంచులు నేనావత్ గోపాల్, బుజ్జికుమార్, రేపని ఇద్దయ్య, జైహింద్‌రెడ్డి, జర్పుల సర్య, బొడ్డుపలిల కృష్ణ, వాగ్య, పరమేష్, అనిల్, కోట్యనాయక్, పగిళ్ల చంద్రయ్య, వెంకట్, ఏఈ శంకర్, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News