Thursday, May 2, 2024

వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ సిక్సర్ ఖాయం

- Advertisement -
- Advertisement -

బిజెపి డకౌట్.. కాంగ్రెస్ రనౌట్

అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము రేవంత్‌కు ఉందా?

కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/కోరుట్ల: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ’బిజెపి డక్ అవుట్ -కాంగ్రెస్ రన్ అవుట్’ ఖాయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్’రావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బిఆర్‌ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ ఈ బహిరంగ సభలో జగిత్యాల జెడ్పీ చైర్’పర్సన్ దావసంత, బిఆర్‌ఎస్ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంత్రి హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. హెలికాప్టర్లో కోరుట్లకు చేరుకున్న హరీశ్‌రావు రూ. 16.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం సభలో పాల్గొని ప్రసంగించారు.

ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ నడుస్తున్నదని, ఆ పరిభాషలో చెప్పాలంటే జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ సిక్సర్లు కొట్టి గెలవడం ఖాయమని, కాంగ్రెస్ రన్ అవుట్, బిజెపి డక్ ఔటు ఖాయమని హరీశ్‌రావు జోస్యం చెప్పారు. గత పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌కు, తెలంగాణకు ఏమీ ఇవ్వని బిజెపికి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. కోరుట్లలో సంవత్సరం తిరిగేలోపు 100 పడకల ఆస్పత్రి పూర్తయింది, ఇప్పుడే బిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ తనతో మాట్లాడుతూ కోరుట్ల ఆసుపత్రికి సిటీ స్కాన్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి వైద్యంలో అవసరమైన కీలకమైనటువంటి సిటీ స్కాన్ అడిగారన్నారు. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ 5 పడకలే ఉన్నాయని, అదనంగా మరో 3 పడకలు కావాలని ఎమ్మెల్యే విద్యాసాగర్’రావు కోరారని హరీశ్‌రావు తెలిపారు. సీటీ స్కాన్‌తో పాటు అదనంగా మరో మూడు డయాలసిస్ పడకలు మంజూరు చేస్తానని హరీశ్‌రావు ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉండేదని ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయన్నారు. డయాలిసిస్ వసతి ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, గతంలో కరీంనగర్లో మాత్రమే డయాలసిస్ ఉండేదని, ఇప్పుడు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ’నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం ’పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానాకు అనే స్థితికి వచ్చామన్నా రు. గత 65 ఏళ్ళు మనం మోసపోయినం, ప్రస్తుతం మ నం మోసపోవద్దు, హామీలు నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్’ను మల్లీ సీఎంగా మనందరం గెలిపించుకొని తీరాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రెస్ పాలన, 9 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనపై చర్చ పెట్టుకుందామని సవాల్ విసిరారు. దీనికి మేము పూర్తిగా సిద్ధమని హరీశ్‌రావు పేర్కొన్నారు. అక్కడ హైదరాబాద్ ఆస్పత్రిలో చేతినిండా పని, జేబు నిండా డబ్బు ఉండే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, వాటిని వదిలి ప్రజాసేవ చేయడానికి తండ్రి మార్గంలో నడవడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందు బరిలో నిలిచాడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని కోరుట్లను మరింత అభివృద్ధి పరుచుకోవాలని హరీష్‌రావు పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎంతోమంది నాయకులను చూశాను కానీ అడిగిన వెంటనే మంజూరు చేసే మంత్రిగా హరీశ్‌రావును మాత్రమే చూస్తున్నానని అభినందించారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్’పర్సన్ అన్నం లావణ్య అనిల్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చీటి వెంకటరావు, జడ్పీటిసి దారిశెట్టి లావణ్య రాజేష్, ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటీ స్వరూప వెంకట్రావుతో పాటూ కౌన్సిలర్లు, పలు గ్రామా ల సర్పంచులు, బీఆర్‌ఎస్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News