Friday, May 3, 2024

తెలంగాణ కోటి ఎకరాల మాగాణికి కెసిఆర్ అహర్నిశలు కృషి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కోటి ఎకరాల మాగాణిని చేసేందుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు నిర్వహించుకుంటున్న తెలంగాణా దశాబ్ది ఉత్సవాల వెనుక అమరుల త్యాగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల స్మారక చిహ్నాన్ని (అమరజ్యోతి) నిర్మించిందని, ఇందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

అమరుల త్యాగ ఫలం ఉద్యమ నేత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో చేసిన పోరాటం మే నేటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వం లో దేశ చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా రెండు పంటలకు గాను ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారని, అలాగే ఏ కారణం చేతైనా రైతన్న మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రధానంగా చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణాలో చెరువుల పునరుద్ధణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఊర చెరువునూ జల సిరులతో నింపారన్నారు. కరెంటు కోసం రైతన్నలు పడుతున్న అష్టకష్టాలు తీర్చేందుకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర కరెంటును అందిస్తున్నారని, అలాగే, ఆడ బిడ్డలు తాగు నీటి కోసం పడుతున్న కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తూ ప్రజల దాహం తీరుస్తున్నారన్నారు.

దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరుకున్నదని, తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణను తీర్చిదిద్దిన కెసిఆర్ దేశ పరిస్థితి పట్ల ఆవేదన చెందుతున్నారని అన్నారు. కెసిఆర్ పాలన, పార్టీ విధానాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్ ఆర్‌ఎస్‌లో పని చేయటానికి దేశ ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News