Thursday, May 2, 2024

రూ.44,605 కోట్లలో కెన్‌బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

Ken-Betwa river link to be completed with Rs 44605 cr

న్యూఢిల్లీ : రూ. 44,605 కోట్లతో కెన్‌బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపడతామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. డామన్ గంగపింజల్, పర్‌టాపి నర్మదా, గోదావరికృష్ణా, కృష్ణాపెన్నా, పెన్నాకావేరి, నదులను ఈ ప్రాజెక్టు కింద అనుసంధానం చేయనున్నట్టు వివరించారు. 9.08 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యంతోపాటు, 62 లక్షల మందికి తాగునీటి వసతి కల్పించడమే ఈ పథకం లక్షమని చెప్పారు. అలాగే 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సౌర విద్యుత్ సమకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 202122 లో రూ.4300 కోట్లు కేటాయించగా, 2022 23 లో రూ. 1400 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. లబ్ధి పొందనున్న రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం రాగానే ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్రం ముందుకు వస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News