- Advertisement -
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న రైల్లో నుంచి మంటలు ఎగసిపడడంతో రెస్ట్ కోచ్‌లో ఉన్న నలుగురు సిబ్బంది చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు చేలరేగినట్టు సమాచారం. రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
- Advertisement -