Thursday, May 2, 2024

యువతి బుగ్గపై బిజెపి అభ్యర్థి ముద్దు!

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపి ఖగెన్ ముర్ము ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక యువతి బుగ్గపై ముద్దుపెట్టుకోవడం తీవ్ర స్థాయిలో వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముర్ము ప్రతర్తనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

చంచల్‌లోని శ్రీహిపూర్ గ్రామంలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ముర్ము ఒక యువతి బుగ్గపై ముద్దు పెట్టుకున్న ఫోటోలు ఆయన సోషల్ మీడియా అకౌంట్లలోనే ముందుగా దర్శనమిచ్చాయి. అయితే వాటిని వెంటనే డెలిట్ చేశారు. కాగా..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదను కోసం వేచి చూస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఫోటోలను తన ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ ముర్ము చర్యను తప్పుపట్టింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వైధించే ఎంపీల నుంచి బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు తీసే నాయకులు ఉన్న బిజెపిలో మహిలా వ్యతిరేకులకు కొరత లేదని వ్యాఖ్యానించింది.

మోడీకా పరివార్ ఇప్పుడు నాకీ కా సమ్మాన్‌లో బిజీగా ఉన్నారని, వీరంతా అధికారంలోకి వస్తే వారేం చేయగలరో ఊహించుకోవచ్చని టిఎంసి పేర్కొంది. ఈ ఘటనను ఖండించిన టిఎంసి మాల్డా ఉపాధ్యక్షుడు దులాల్ సర్కార్ ఇది బెంగాలీ సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఓట్ల కోసం అడుక్కుంటున్న బిజెపి అభ్యర్థి అలా ఎందుకు చేయవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాగా..ఈ వివాదంపై ముర్ము కూడా స్పందించారు. బా యువతి తన కుమార్తె లాంటిదని, అందుకే తాను అలా చేశానని ఆయన వివరించారు.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారెవరో ఎడిటింగ్ చేసి ఫోటోలు పెట్టారని, ఇది వారి నీచ మనస్తత్వాన్ని అద్దం పడుతోందని ముర్ము విమర్శించారు. తాను ముద్దు పెట్టుకున్న బాలిక తమ కుటుంబానికి చెందిన వ్యక్తేనని, తమ కార్యకర్తలలో ఒకరి కుమార్తెని ఆయన తెలిపారు. బెంగళూరులో నర్సింగ్ చదువుతున్న ఆ బాలికకు మంచి మార్కులు రావడంతో తాను ఆమెను అభినందనపూర్వకంగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నానని, ఆయన చెప్పారు. మన సొంత పిల్లలను సైతం అలానే అభినందిస్తామని, ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులిద్దరూ ఆమె పక్కనే ఉన్నారని, ఈ రోజు కూడా తాను అదే ప్రాంతంలో ప్రచారం చేశానని, దానిపై ఎవరూ చెడుగా మాట్లాడలేదని, ఓట్ల కోసం తృణమూల్ రాజకీయాలు చేస్తోందని ముర్ము విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News