బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అటు బాలీవుడ్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే భూల్ భూలయ్య 2 చిత్రం తర్వాత ఈ భామ సక్సెస్‌కి దూరమైంది. ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు కియారా చేతిలో కేవలం ఒకే ఒక్క చిత్రం ఉంది. అదే కన్నడ చిత్రం టాక్సిక్. యష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో కియారా పాత్ర ప్రాధాన్యత ఎంత? అన్నది ఆసక్తికరం. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది.
నయనతార, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ లాంటి అందమైన భామలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్‌కి జోడీగా ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ అవకాశం నయన్ అందుకుందా? కియారాకి వచ్చిందా? అన్నది తెలియాల్సి ఉంది. బెంగుళూరులో అక్టోబర్ నుంచి మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో కియారా పాల్గొననుంది. ఇందులో యష్, -కియారాలపై కొన్ని కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక టాక్సిక్ సినిమాతో హిట్ కొట్టాలని కియారా తహతహలాడుతోంది.