Sunday, December 15, 2024

కెటిఆర్‌ను కాపాడేందుకే బిజెపి మూసీ డ్రామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : భవిష్య త్ తరాల కోసమే మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. సీఎం తీ సుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని కోరా రు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు. తమది బుల్డోజర్ ప్రభుత్వం కా దని, ఆ తరహా ప్రభుత్వం యూపీలో ఉం దని అన్నారు. మోడీ ఆదేశిస్తే యోగీ పా టిస్తారని వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ తప్పు బహిర్గతమైందన్నా రు. కేటీఆర్‌ను కాపాడడానికే మూసీపై బిజేపీ, బిఆర్‌ఎస్ డ్రామాలాడుతున్నాయన్నాయని ధ్వజమెత్తారు. ప్రజల్లో వ్యతిరేకత బిఆర్‌ఎస్ నేతలు సృష్టించిన కట్టుకథ అని, అద్భుతంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క రోజు నిద్రతో ఏం తెలుసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని, ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదని స్పష్టం చేశారు.

మూసీ పునరుజ్జీవంలో ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తామని, సబర్మతిపై లేని అభ్యంతరం మూసీపై ఎందుకు? మార్పుకోసమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ మార్పును చూపించబోతున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మరో మాట లేదని, మూసీ పునరుజ్జీవంలో నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు. బిజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒకటేనని, ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారన్నారు. కేటీఆర్‌పై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించడానికే బీజేపీ మూసీ నిద్ర నాటకమాడిండని, మూసీ పునరుజ్జీవానికి సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామరని, బీఆర్‌ఎస్ మాదిరిగా తమది నియంతృత్వ ప్రభుత్వం కాదన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ మహా నగరాల సరసన చేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విజన్ ఉందని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.

అక్కడ నువ్వు ప్లాట్ కొనుక్కుంటావా ..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమది బుల్డోజర్ పాలన కాదన్నారు. యూపీలో కొనసాగుతున్న యోగి ఆదిత్యనాథ్ పాలనే బుల్డోజర్ పాలన అని అని ఆరోపించారు. నిజాం కాలంలో మూసీ బోర్డు కూడా ఉండేదని గుర్తుచేశారు. లగచర్ల దాడిలో కేటీఆర్ ఉన్నాడని స్పష్టమైందని, కాబట్టే డైవర్ట్ చెయ్యడానికి కిషన్ రెడ్డి బస చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు ప్లాట్ కొనుక్కుంటావా కిషన్ రెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ బస కార్యక్రమం మొత్తం డ్రామా అని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకే బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఫోకస్ మొత్తం ఫొటో షూట్ మీదే ఉందని ఎద్దేవా చేశారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారంటేనే తెలుస్తుందని, అక్కడ పరిస్థితి ఎలా ఉందో అని అన్నారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని చెప్పారు. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారని గుర్తు చేశారు.

ఇంకెన్నాళ్లు బీఆర్‌ఎస్‌ను ప్రొటెక్ట్ చేస్తారు :
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోయిన ప్రతీ సారి కిషన్ రెడ్డి బయటకి వస్తారని ఎద్దేవా చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్‌ఎస్‌ను ప్రొటెక్ట్ చేస్తారని కిషన్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అయినా ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారని అడిగారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కి ఒక న్యాయం..మూసీ రివర్కి ఒక న్యాయమా..? అని అడిగారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు విద్య అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందననే వీళ్లకు భయం పట్టుకుందని సెటైర్ వేశారు. గుజరాత్‌ను ఎక్కడ తెలంగాణ వెనక వేస్తుందో అన్న భయం బీజేపీనీ వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. డీపీఆర్ వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టాలో తెలుస్తుందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. పదేళ్లు తెలంగాణ అభివృద్ధి కుంటు పడిందని వెల్లడించారు. అభివృద్ధిలో తెలంగాణ మార్పు చూస్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్‌గా ముందుకు వెళుతోందని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాని కీలక ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News