Monday, October 14, 2024

ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుంది: కొడాలి నాని

- Advertisement -
- Advertisement -

ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుంది
ఎలక్షన్ టైమ్‌లో జగన్‌ది సాహసమే: కొడాలి నాని
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఎసిబి కోర్ట్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ అన్న ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన విగ్రహాల నుంచి ఆనంద భాష్పాలు వస్తున్నాయన్నారు. నన్నెవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్న చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. లక్షలాది మంది పిల్లల సొమ్మును పందికొక్కులా దోచుకున్న చంద్రబాబు దానిని లోకేష్‌కు ధారాదత్తం చేశాడని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు తనలోని దొంగ స్కిల్స్ ఉపయోగించి స్కిల్ డెవలప్‌మెంట్ సొమ్మును దోచుకున్నాడని, చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని లోకేష్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలని కొడాలి నాని చురకలంటించారు.

సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబును పట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానిగా అభినందనలు చెబుతున్నట్లు నాని అన్నారు. 74 ఏళ్ల వయసులో అన్న ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టిన చంద్రబాబు.. అదే వయసులో జైలుకెళ్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో మరోసారి రుజువైందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయించి సీఎం వైఎస్ జగన్ సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని నాని ప్రశ్నించారు. ఎవరు అవినీతికి పాల్పడినా ఉక్కుపాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించార న్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయగానే అసలు పుత్రుడి కంటే దత్తపుత్రుడి హడావుడి ఎక్కువైందంటూ పవన్‌పై సెటైర్లు వేశారు.

Also Read: ఇది చిన్న కేసే.. ఇంకా బోలెడు, వాటిలోనూ శిక్ష తప్పదు: సజ్జల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News