Thursday, May 9, 2024

అభిమాని బహుమతికి కోహ్లీ ఫిదా

- Advertisement -
- Advertisement -

Kohli

 

గువాహతి : తన అభిమాని ఇచ్చిన ప్రత్యేక బహుమతికి టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. పాత ఫోన్లను ఉపయోగించి తన రూపం వచ్చేలా రాహుల్ అనే అభిమాని రూపొందించిన అద్భుత కళాఖండాన్ని చూసి కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను బిసిసిఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘ పాత ఫోన్లను పయోగించి తయారు చేసిన ఆర్ట్. అభిమాని ప్రేమ ఎలా ఉంది?’ అంటూ ట్వీట్ చేసింది. ఈ వీడియోలో కోహ్లీ ఆ బహుమతిపై ఆటోగ్రాఫ్ చేస్తూ తన అభిమానికి థ్యాంక్స్ చెప్పాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో రాహుల్ కోహ్లీపై ఉన్న ప్రేమను పంచుకున్నాడు. గువాహతికి చెందిన అతను తాను కోహ్లీకి వీరాభిమానినని చెప్పుకున్నాడు. పాత ఫోన్లు, వైర్‌తో కలిసి కోహ్లీ రూపం వచ్చేలా కళాఖండాన్ని తయారు చేయడానికి తనకు మూడు రోజులు పట్టిందని చెప్పాడు. తన ఫేవరేట్ క్రికెటర్‌ను కలుసుకున్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందని తెలిపాడు. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా భారత్‌శ్రీలంకలు ఆదివారం గువాహతిలో తొలి మ్యాచ్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే.

Kohli Happy for the fans prize
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News