హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిఎం రేవంత్ భాష మార్చుకోవాలని, ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలని సూచించారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందని, ఈ విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి తెలియదన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, మంత్రి పదవి కావాలంటే అప్పుడే మాజీ సిఎం కెసిఆర్ ఇచ్చేవారని, ఇంకా మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. తెలంగాణను సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని, రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో బిఆర్ఎస్ ఉందని, ప్రతిపక్ష నేత పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు.
రేవంత్ ప్రతిపక్షాలను తిట్టడం మానేసి… ఆ విషయం ప్రజలకు చెప్పాలి: రాజగోపాల్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -