Sunday, May 19, 2024

బిఆర్‌ఎస్‌కు అన్ని సీట్లు వస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చెప్పినట్లుగా పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీకి 8 నుంచి 12 సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రముఖ టివి ఛానెల్ డిబేట్‌లో కెసిఆర్ ఇచ్చిన కామెంట్‌పై కోమటిరెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. తాము అర్భుకులం కాదని, అర్జునులమై అసెంబ్లీ ఎన్నికలలో పోరాటం చేశామన్నారు. 25 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు తమతో టచ్‌లో ఉన్నారని కెసిఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి 25 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు వస్తా అంటున్నారని, వాళ్ల పేర్లు తాను చెబుతానని, దమ్ముంటే కెసిఆర్ వద్దకు వచ్చే కాంగ్రెస్ ఎంఎల్‌ఎల పేర్లు చెప్పాలని ఛాలెంజ్ చేశారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలుస్తుందని వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News