Friday, April 26, 2024

బిజెపి కార్పొరేటర్ కాసుల దందా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొంత మంది బిజెపి కార్పొరేటర్లు చెప్పేవి శ్రీరంగ నీతులని, చేసేవి అన్ని అక్రమాలేనని భారత రాష్ట్ర సమితి నాయకులు జక్కిడి మల్లారెడ్డి అన్నారు. తమ మన్సురాబాద్ డివిజన్‌లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డికి కప్పం కట్టకుండా చిన్న నిర్మాణం కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బిఆర్‌ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అనుమతులు ఉన్నా కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. తాము నిర్మిస్తున్న భవనానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని, అయినా మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి 20 లక్షలు డిమాండ్ చేశారని జక్కిడి మల్లారెడ్డి, రఘువీరా రెడ్డి ఆరోపించారు.

సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకున్న తనకు కప్పం కట్టాల్సిందేనని బెదిరింపులకు పాల్పడుతున్న అదే కార్పొరేటర్, ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారన్నారు. కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నరని ఇందుకు సంబంధించిన పోటోలను మీడియాకు విడుదల చేశారు. కార్పొరేటర్ పాల్పడుతున్న కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై తను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని జక్కిడి మల్లారెడ్డి తెలిపారు. ఇందుకు కార్పొరేటర్ సిద్దామా అని సవాల్ విసిరారు. తను ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్దమేనని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News