Saturday, July 27, 2024

సంక్రాంతి లుక్ అదుర్స్

- Advertisement -
- Advertisement -

Krack movie

 

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని- కాంబినేషన్‌లో రాబోతున్న ‘క్రాక్’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా యూనిట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌తో పాటు మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. ‘మా లాగే మీరు కూడా ఈ పండగను మీ కుటుంబ సభ్యులతో సరదాగా జరుపుకోండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు’ అని సినిమా యూనిట్ సభ్యులు పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో రవితేజ లుంగీ, వైట్ షర్ట్‌తో ఆకట్టుకోగా.. శృతిహాసన్ చీర కట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తూ ఆకట్టుకుంది. మొత్తానికి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ‘క్రాక్’ సినిమాని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Krack movie poster release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News