Thursday, May 2, 2024

ఆ పని తప్పనిసరిగా చేస్తుందట

- Advertisement -
- Advertisement -

Deciding not to do wrong things again in life

 

ప్రతి వారికి తమ దైనందిన జీవితంలో రకరకాల అలవాట్లు ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు కొన్ని నిర్దిష్టమైన పనులు చేస్తుంటారు. అయితే సౌత్‌బ్యూటీ శృతిహాసన్ నిద్రించే ముందు ఓ పని తప్పనిసరిగా చేస్తుందట. ఆమె తండ్రి కమల్‌హాసన్ చిన్నప్పుడే ఓ విషయం నేర్పించాడట. అదేమిటంటే… ఏ రోజైనా సరే ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రించలేకపోతే… ఆ రోజున మనసుకు నచ్చని పని ఏదో చేసి ఉంటామని అర్థం చేసుకోవాలని చెప్పాడట కమల్. తన జీవితంలో ఈ మాటలను మరచిపోనంటున్న శృతిహాసన్… ప్రతి రోజు నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన అన్ని పనులను గుర్తు చేసుకుంటానని చెప్పింది. తప్పయినా ఒప్పయినా ఏదైనా సరే అన్ని పనులను గుర్తుచేసుకుంటానని చెప్పిన ఆమె… ఏదైనా తప్పు పనులు చేసి ఉంటే మాత్రం వాటిని జీవితంలో మళ్లీ చేయకూడదని నిర్ణయం తీసుకుంటుందట. అలా చేసిన తర్వాతే తనకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని శృతిహాసన్ చెప్పింది. ప్రతి రోజు నిద్రించేముందు ఆరోజు మొత్తాన్ని గుర్తుచేసుకోకపోతే ఏదో వెలితిగా ఉంటుందని ఆమె పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News