Monday, April 29, 2024

పంజాబ్‌కు చావోరేవో

- Advertisement -
- Advertisement -

Today Kings XI Punjab vs Kolkata knight riders match

 

నేడు కోల్‌కతాతో పోరు

దుబాయి: వరుస ఓటములతో సతమతమవుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం ఒక విజయాన్నే సాధించింది. ఇక నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలుపు కోవాలంటే ఇకపై జరిగే మ్యాచుల్లో కచ్చితంగా గెలవాల్సిందే. హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో పంజాబ్ ఆటగాళ్లు తేలిపోయారు. దీంతో ఘోర పరాజయం తప్పలేదు. కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఒక్కడే కాస్త నిలకడగా రాణిస్తున్నాడు. మయాంక్ అగర్వాల్, మాక్స్‌వెల్, మన్‌దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. తొలి మ్యాచుల్లో పర్వాలేదనిపించిన మయాంక్ ఆ తర్వాత వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఇక స్టార్ ఆటగాడు మాక్స్‌వెల్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు.

అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈసారైన అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. అయితే కెప్టెన్ దినేశ్ కార్తీక్ వైఫల్యం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు కార్తీక్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యాడు. ఇక చెన్నైపై ఒక్క రాహుల్ త్రిపాఠి తప్ప అందరూ విఫలమయ్యారు. ఈసారైన సమష్టిగా రాణించాల్సిన అవసరం జట్టు సభ్యులపై ఉంది.

చెన్నైతో బెంగళూరు ఢీ

మరో మ్యాచ్‌లో చెన్నైతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు మూడేసి విజయాలు సాధించాయి. అయితే తమ కిందటి మ్యాచుల్లో రెండు జట్లు కూడా ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. బెంగళూరులో విరాట్ కోహ్లి, పడిక్కల్, డివిలియర్స్, ఫించ్, మోయిన్ అలీ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ పలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన డివిలియర్స్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో కూడా బెంగళూరు బాగానే కనిపిస్తోంది. చాహల్ రూపంలో పదునైన అస్త్రం జట్టుకు అందుబాటులో ఉంది. వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైని, మోయిన్ తదితరులతో బౌలింగ్ పటిష్టంగా ఉందనే చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News