Wednesday, November 13, 2024

నువ్వో లెజెండ్..

- Advertisement -
- Advertisement -

David Warner praises Natarajan

 

నట్టూపై వార్నర్ ప్రశంసలు

మెల్‌బోర్న్: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ (నట్టూ)పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. నటరాజన్‌ను ఓ లెజెండ్ అని అభివర్ణించాడు. నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం సాధారణ విషయం కాదన్నాడు. ఐపిఎల్ సందర్భంగానే నటరాజన్ ప్రతిభా ఏంటో అందరికీ తెలిసిందన్నాడు. అద్భుత యార్కర్‌లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లపై అతను విరుచుకుపడే విధానాన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. సన్‌రైజర్స్‌లో నటరాజన్‌లాంటి బౌలర్ ఉండడం శుభసూచకమన్నాడు. రానున్న రోజుల్లో అతను ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా ఎదగడం ఖాయమని వార్నర్ జోస్యం చెప్పాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News