Tuesday, April 30, 2024

స్వర్ణకారుడి కుర్రాడి కథ

- Advertisement -
- Advertisement -

Bangaru bullodu pre release event

 

అల్లరి నరేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా ఏటివి సమర్పణలో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ- రిలీజ్ వేడుకలో దర్శకులు మెహర్ రమేష్, అజయ్ భూపతి, నిర్మాతలు కె.యల్. దామోదర ప్రసాద్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, అమ్మిరాజు, నటులు రాజా రవీంద్ర, అల్లరి నరేశ్, పృథ్వీ, ప్రభాస్ శ్రీను, హీరోయిన్ పూజా జవేరి, దర్శకుడు గిరి, రచయిత వెలిగొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యూసర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘బంగారు బుల్లోడు’ రిలీజ్ పోస్టర్‌ని మెహర్ రమేష్ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ “బంగారు బుల్లోడు టైటిల్‌తో పాటు ట్రైలర్ చాలా బాగుంది. సాయి కార్తీక్ మంచి సాంగ్స్ కంపోజ్ చేశాడు. నరేష్ సినిమా అంటే కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది”అని అన్నారు. హీరో నరేష్ మాట్లాడుతూ “విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. స్వర్ణకారులను కించపరిచే విధంగా కాకుండా వారి కష్టాన్ని, వారి వృత్తిని హైలెట్ చేసి మా చిత్రంలో వారిని గొప్పగా చూపించాం”అని తెలిపారు. చిత్ర దర్శకుడు గిరి మాట్లాడుతూ “స్వర్ణకారుడి కుర్రాడి కథ ఇది. కథలోనే కామెడీ రన్ అవుతూ ఎంటర్‌టైన్‌మెంట్ దిశగా సినిమా ఉంటుంది”అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News