Tuesday, May 14, 2024

హైదరాబాద్ మేధాకు భారీ రైల్వే కాంట్రాక్టు

- Advertisement -
- Advertisement -

Huge railway contract for Hyderabad Medha

 

న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మక వందేభారత్ తరహా ట్రైన్ భాగాల తయారీ కాంట్రాక్టు లభించింది. రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఈ కంపెనీకి రూ 2,211 కోట్ల విలువైన భారీ స్థాయి కాంట్రాక్టు మంజూరు అయింది. శుక్రవారం రైల్వే మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నిర్థారించారు. వందేభారత్ రైలులోని 44 బోగీల ఛోదక, నిర్వహణ ఇతరత్రా పరికరాల తయారీ బాధ్యతను ఈ సంస్థ తీసుకుంది. ట్రైన్ 18గా ముందు నామకరణం చేసిన ఈ రైలుకు తరువాతి దశలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అని ఖరారు చేశారు. ఆగస్టులో ముడిభాగాల తయారీ కాంట్రాక్టు టెండర్లు వెలువరించారు. అయితే చైనా సంయుక్త కంపెనీ అయిన పయనీర్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కటే వేలంలో చివరికి మిగిలిన విదేశీ బిడ్డర్ అయింది. దీనితో ఈ టెండర్‌ను రద్దు చేసి, తిరిగి సెప్టెంబర్‌లో కొత్త టెండర్లను పిలిచారు. అన్ని అంశాలను పరిగణనలకి తీసుకుని ఈ ముడిభాగాల కాంట్రాక్టును మేధా సంస్థకు అప్పగిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News