Friday, May 10, 2024

చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

Inzamam-ul-Haq Heaps Praise On Team India

 

లాహోర్: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఆనందం వ్యక్తం చేశాడు. అసాధారణ ఆటతో భారత్ చారిత్రక విజయాన్ని అందుకుందన్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించడం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. భారత్ గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రదర్శన చేయలేదన్నాడు. సీనియర్లు, కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా అసాధారణ పోరాట పటిమతో భారత్ సాధించిన విజయం టెస్టు క్రికెట్ చరిత్రలోనే తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయమన్నాడు. కీలక ఆటగాళ్లు అందుబాటుల లేకున్నా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె జట్టును నడిపించిన తీరుపై ఇంజమామ్ ప్రశంసలు కురిపించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News