Sunday, April 28, 2024

క్రికెటర్‌ను సంప్రదించిన ఆ మహిళా ఎవరో?

- Advertisement -
- Advertisement -

ముంబై: కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఎప్పుడూ బెట్టింగులు కొనసాగుతూనే ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఐపిఎల్‌పై కోట్లాది రూపాయల బెట్టింగు జరగడం అనవాయితీగా వస్తోంది. బెట్టింగు నివారణకు పలు దేశాల ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇదిలావుండగా కిందటి ఏడాది యూఎఇ వేదికగా జరిగిన ఐపిఎల్‌లో కూడా ఓ మహిళా బెట్టింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించింది. ఇందుకుగాను ఓ క్రికెటర్‌తో కూడా సంప్రదించింది. ఈ విషయాన్ని ఆ క్రికెటర్ స్వయంగా బిసిసిఐ అవినీతి నిరోధక బృందానికి తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేశారు.

అయితే, సదరు మహిళా వ్యక్తిగత బెట్టింగు కోసం మాత్రమే క్రికెటర్‌తో కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందని బిసిసిఐ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. తనను ఓ డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఆ మహిళా తనను సంప్రదించిన క్రికెటర్‌కు కోవిడ్‌కు సంబంధించిన పలు జాగ్రత్తలు తెలిపింది. ఇదే సమయంలో ఆ క్రికెటర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టుకు సంబంధించిన అంతర్గిత వ్యవహారాలు తెలపాలని కోరింది. దీనిపై ఆ క్రికెటర్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళుతానని హెచ్చరించాడు. అనంతరం తనను మహిళా సంప్రదించిన పూర్తి వివరాలను బోర్డు అధికారులకు వివరించాడు. దీంతో ఆ క్రికెటర్‌పై బిసిసిఐ ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. అంతేగాక ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి క్రికెటర్ ఎలాంటి బెట్టింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేసింది.

Nurse approached A Player for betting during IPL 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News