Thursday, November 7, 2024

దేశంలో విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ.. పెద్దసంఖ్యలో పక్షుల వధ

- Advertisement -
- Advertisement -

మరో రెండు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ
కేరళలోని రెండు జిల్లాల్లో పెద్దసంఖ్యలో పక్షుల వధ
మధ్యప్రదేశ్‌లో 155 కాకుల మృతి

కొట్టాయం/ఇండోర్: దేశంలో మరోసారి బర్డ్‌ఫ్లూ విజృంభిస్తోంది. పక్షులను పీక్కుతినే ఈ వైరస్ మహమ్మారి మొదట రాజస్థాన్‌లో కనిపించగా, ఇప్పుడు కేరళ, మధ్యప్రదేశ్‌లో ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. కేరళలో మంగళవారం రెండు జిల్లాల్లోని బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో బాతులను, కోళ్లను వధించడం ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లోని కిలోమీటర్ పరిధిలోని ప్రభావిత ప్రాంతాల్లో పెంపుడు పక్షులైన కోళ్లు, బాతులను వధించారు. వీటిలో బర్డ్‌ఫ్లూకు చెందిన హెచ్5 ఎన్8 స్ట్రెయిన్ కనిపించడంతో సంహార కార్యక్రమాన్ని చేపట్టారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ డిసీజెస్ ల్యాబ్‌లో శాంపిళ్లను పరీక్షించిన మరుసటి రోజున ఈ చర్యకు దిగినట్టు అధికారులు తెలిపారు.
రెండు జిల్లాల్లోనూ పక్షుల వధకు శీఘ్ర స్పందన దళాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అలప్పుజా కుట్టానాడ్ ప్రాంతంలోని నాలుగు పంచాయతీల్లో పక్షుల వధ చేపట్టగా, ఒక్క కరువట్టలోనే 12,000 పక్షుల్ని వధించినట్టు ఓ అధికారి తెలిపారు. కొట్టాయంలోని నీడ్నూర్ పంచాయతీలో 3000 పక్షుల్ని వధించారు. వీటిలో 1700 బాతులని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 40,000 పక్షుల్ని వధించనున్నామని, వీటిలో 34,000 ఒక్క కుట్టనాడ్ ప్రాంతంలోనే ఉంటాయని తెలిపారు. వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలంటే ఈ చర్య తప్పదని అధికారులు తెలిపారు. కుట్టనాడ్, కార్తికప్పాలీ తాలూకాల్లో బాతులు, కోళ్ల మాంసం, గుడ్ల అమ్మకంపై నిషేధం విధిస్తున్నట్టు అలప్పుజా కలెక్టర్ తెలిపారు.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో బర్డ్‌ఫ్లూ వల్ల ఇప్పటివరకూ 155 కాకులు చనిపోయినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్షులు ఈ వైరస్ బారిన పడుతున్నట్టు వారం రోజుల క్రితం గుర్తించామని వారు తెలిపారు. ఇండోర్‌లో డిసెంబర్ 29న 50 కాకులు మరణించడంతో ఈ వైరస్‌ను గుర్తించామని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఇతర పక్షుల్లో ఈ వైరస్‌ను గుర్తించలేదని వారు తెలిపారు. 120 కోళ్లు, సిరిపూర్ సరస్సులోని 30 వలస పక్షల శాంపిళ్లను భోపాల్‌లోని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపామని వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు.

155 Crows Dead in Madhya Pradesh with Bird Flu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News