Thursday, May 16, 2024

బ్రిటీష్ ప్రధాని భారత పర్యటన రద్దు

- Advertisement -
- Advertisement -

బ్రిటీష్ ప్రధాని భారత పర్యటన రద్దు
కొవిడ్ స్ట్రెయిన్ వ్యాప్తి దృష్టా రాలేనని ప్రధాని ఫోన్ చేసి చెప్పిన జాన్సన్

న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. బ్రిటన్‌లో కొవిడ్ స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోరిస్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థన మేరకు గణతంత్ర దినేత్సవాలను ప్రత్యేక అతిథిగా భారత్ రావడానికి బోరిస్ గత నెలలోనే అంగీకరించారు. అయితే కొవిడ్ స్ట్రెయిన్ కలవరపరుస్తున్న తరుణంలో భారత్ పర్యటనకు రాలేనని బోరిస్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రిటన్ జి7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందే తాను భారత్‌లో పర్యటిస్తానని జాన్సన్ స్రధానికి చెప్పినట్లు లండన్‌లో ప్రధాని నివాసం డౌనింగ్‌స్ట్రీట్ అధికార ప్రతినిధి తెలియజేశారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అతిథి హోదాలో హాజరు కానున్నారు.

Britain PM Cancels Republic day visit to India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News