Wednesday, December 4, 2024

కాబూల్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌..

- Advertisement -
- Advertisement -

కాబూల్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.  ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ దేశ పౌరులను తరలించేందుకు వెళ్లిన విమానాన్ని గుర్తుతెలియని దుండగులు హైజాక్‌ చేశారని విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి యెవ్జెనీ యెనిన్‌ మీడియాకు తెలిపారు. హైజాక్ చేసిన విమానాన్ని ఇరాన్‌కు తరలించినట్లు గుర్తించామని చెప్పారు. ‘ఆదివారం మా దేశానికి చెంని విమానం కాబూల్‌లో హైజాక్‌కు గురైంది. తమ దేశ పౌరులను తీసుకొచ్చేందుకు పంపిన విమానాన్ని.. తమ వారితో నింపుకుని ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉక్రేనియన్లను తరలించేందుకు మరో విమానాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని యెవ్జెనీ యెనిన్‌ మీడియాకు చెప్పారు.

Ukraine plane hijacked in Kabul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News