Tuesday, May 7, 2024

సంక్రాంతి బరిలో…

- Advertisement -
- Advertisement -

Krack movie Release on January 14th

 

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ పోలీస్ డ్రామా ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పుడో థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని చెప్పేశారు. అందుకు తగ్గట్టుగానే మిగిలి ఉన్న కాస్త షూట్‌ను పూర్తి చేసేసి ఓ రిలీజ్ డేట్‌ను అనుకున్నారు. దానినే ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రకటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో జనవరి 14న విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News