Monday, May 13, 2024

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

హయత్‌నగర్‌ః నగర శివారు ప్రాంత కాలనీలు బిఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ది చేందుతాయని హయత్‌నగర్, మన్సురాబాద్ డివిజన్‌ల మాజీ కార్పొరేటర్‌లు సామ తిరులమల్‌రెడ్డి, కోప్పుల విఠల్‌రెడ్డిలు వెల్లడించారు. పఠాన్‌చేరువు ఫరిధీ కొల్లురు డబల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రానున్న ఎన్నికలలో మళ్లి అధికారంలోకి రాగానే క్యాబినెట్లో మొదటి సంతకం ఎల్బీనగర్ నుండి హయత్‌నగర్ వరకు మెట్రోరైల్ పోడగిస్తానని ప్రకటించడంతో శుక్రవారం హయత్‌నగర్‌లోని అంబెద్కర్ విగ్రహం వద్ద బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హజరైన మాజీ కార్పొరేటర్‌లు తిరుమల్‌రెడ్డి, విఠల్‌రెడ్డిలు మాట్లాడుతూ ఎల్బీనగర్ నుండి హయత్‌నగర్ వరకు మెట్రో రైలు పోడగింపుతో రెండు డివిజన్‌లు అభివృద్దిలో ముందుకు దూసుకెళతాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ది ఎప్పుడులేని విధంగా ఈ 9 సంవత్సరాలలో పురపాలకశాఖ మంత్రి కేటిఆర్ సహకారం, ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిల కృషితో రాష్ట్రంలోనే ఎల్బీనగర్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్దిపై అహర్నిషలు కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మన్సురాబాద్ పార్టీ డివిజన్ ఆధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, సినియర్ నాయకులు బోడ బిక్షపతి, నక్క రవీంద్‌గౌడ్, పారంద రమేశ్, హయత్‌నగర్ డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణారెడ్డి, మాజీ ఆధ్యక్షుడు గుడాల మల్లేష్, భాస్కర్ సాగర్, పారంద నర్సింగ్, గజ్జి ఆశోక్ యాదవ్, మహ్మద్ రఫీక్, కోట రవీందర్‌రెడ్డి, కోట సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News