Saturday, September 20, 2025

దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ సవాల్ విసిరారు.సిఎంకు ఉన్న అవగాహన, ఆయనకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో ఇందులో ఏదో కుంభకోణం జరిగింది అని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కెటిఆర్ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. ఓపెన్ లైవ్ కెమెరాలు ముందు లై డిటెక్టర్ పెట్టి ఇద్దరం మాట్లాడుదామని… ఎవరు దొంగనో.. ఎవరు దొరనో.. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తారని పేర్కొన్నారు.

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగనే కనబడ్డట్టు.. రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నింట్లో కూడా దొంగతనం జరుగుతది.. అన్నింట్లో పైసలు తింటరనే దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు కానీ.. తాను ఒక్క పైసా అవినీతి చేయలేదని చెప్పారు.ఈ దొంగ కేసులు, లొట్టపీస్ కేసులు నిలవవు అని పేర్కొన్నారు.ఎసిబి అధికారులు పాడిందే పాటరా అన్నట్లుగా అడిగిందే అడిగారని అన్నారు. వాళ్లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తానని చెప్పారు. మళ్లీ విచారణకు రావాలని ఎసిబి అధికారులు చెప్పలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News