Saturday, April 20, 2024

తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్రమోడీపై కెటిఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన గురువారం ట్వీట్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపుబోర్డు, మెట్రో రెండో దశ లేదని ప్రధాని చెప్పారు. ఐటిఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని మోడీ చెప్పారు.

తెలంగాణకు ఏదీ ఇచ్చేది లేదని మోడీ సర్కార్ చెప్పిందని వివరించారు. ప్రధాని మోడీ ప్రాధాన్యతలో అసలు తెలంగాణే లేనప్పుడు తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని మోడీ ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కులిన పార్టీ ఎందుకుండాలి?? అని కెటిఆర్ సూటిగా ప్రశ్నించారు.
విభజన చట్టం హామీల ఉల్లంఘనలో వెన్నెముక లేని ఆ నలుగురు బిజెపి ఎంపిలదే బాధ్యత
ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోడీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించినందుకు తెలంగాణకు చెందిన నలుగురు వెన్నెముక లేని బీజేపీ ఎంపిలు బాధ్యత వహించాలని మరో ట్వీట్ ద్వారా కెటిఆర్ అన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ నిరాకరించబడినప్పుడు, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ లభిస్తుందని ఎద్దేవా చేశారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇదేనని మంత్రి కెటిఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News