Wednesday, September 11, 2024

మెడికల్ సీట్లపై లోకల్ లొల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మె డిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా.. ?- అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా క నిపిస్తోందని పేర్కొన్నారు. జిఒ 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశా రు. 9వ తరగతి నుంచి 12వ తరగ తి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభు త్వం చెబుతోందని, ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రా ష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోక ల్ అవుతారని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెంది న విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని, కొత్త ని బంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారని అన్నా రు.

అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోక ల్ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 2023-24 విద్యాసంవత్స రం వరకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించామని, దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని, దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా…గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపు విషయంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జిఒ 33పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మం త్రి దామోదర్ రాజనరసింహ స్ప ష్టత ఇచ్చారు. జిఒ 33తో స్థానిక వి ద్యార్థులు నష్టపోతారంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ‘ఎ క్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మం త్రి స్పందించారు. ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించి 2017 జులై 5న అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 114ను మంత్రి ప్రస్తావించారు. ఆ జిఒలోని 9 నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధనను జిఒ 33లో కొనసాగించామని పేర్కొన్నా రు. అయితే, అదే జిఒలోని 6 నుం చి 12 వరకు కనీసం నాలుగేళ్లు వి ద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమని మంత్రి స్ప ష్టం చేశారు.

జిఒ 114లోని ఈ ని బంధన ప్రకారం విద్యార్థి నాలుగేళ్లు తెలంగాణలో..మిగిలిన మూడేళ్లు ఎ పిలో చదివితే వారిని తెలంగాణ స్థా నికులుగా పరిగణించారని గుర్తు చే శారు. అయితే ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జూన్ 2తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ నిబంధనను కొనసాగించలేమని మంత్రి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంతో ఎంబిబిఎస్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను జిఒ 33 ప్రకారం భర్తీ చేయనున్నారు. నీట్ యుజి 2024 పరీక్షలో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్ధులు ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News