Thursday, May 2, 2024

రేపు తుకారం గేటర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR will inaugurate Tukaram Gate Railway Underbridge

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరబాద్ ప్రజలు ట్రాఫిక్ సమస్యలకు తీర్చేందుకు మరో గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. రూ. 29 కోట్ల 10 లక్షల వ్యయంగా నిర్మించిన తుకారం రైల్వే అండర్ బ్రిడ్జిని మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. వ్యూహాత్మక రోడ్ డవలప్‌మెంట్ (ఎస్సార్‌డిపి ) పథకం కింద ఈ బ్రిడ్జిని నిర్మించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్డు డ్రైనేజ్ పనుల కోసం రూ.29 కోట్ల 10 లక్షల వ్యయంతో జిహెచ్‌ఎంసి , రైల్వేశాఖ నిధులుతో ఈ కార్యాక్రమాన్ని చేపట్టారు.

ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మొత్తం 375 మీటర్ల పొడవు, 40 మీటర్ల బాక్స్ డ్రైనేజ్ 245 మీటర్ల అప్రోచ్ రోడ్ అందులో 86 మీటర్ల ర్యాంపు రోడ్డు మెట్టుగూడ వైపు మరో 159 మీటర్ల ర్యాంపు మారేడ్‌పల్లి వైపు నిర్మాణం చేపట్టారు. 5.50 మీటర్ల వెడల్పు గల అప్రోచ్ రోడ్ క్యారేజ్ మార్గం 150 మీటర్ల వెడల్పు బాక్స్ పోర్షన్ మరో 150 మీటర్ల వెడల్పు అప్రోచ్‌రోడ్‌ను ఏర్పాటు చేశారు. లాగూడ రైల్వే స్టేషన్ రైళ్ళ రాకపోకల వల్ల తరచు మూసి ఉండే రైల్వే క్రాసింగ్‌తో వచ్చే సమస్యలను నివారించేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ నూతన ఆర్‌యుబితో మల్కాజిగిరి, మారేడ్‌పల్లి, తార్నాక, మెట్టుగూడ, లాలాపేట్, సికింద్రాబాద్ రోడ్దు మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అంతే కాకుండా మౌలాలి ,తార్నాక, నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళేందుకు ఈ ప్రాంత ప్రజలకు మంచి కనెక్టివిటీగా ఉంటుంది. రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు ఎల్‌సి 256/ ఈ లెవల్ క్రాసింగ్ వద్ద తుకారం గేట మల్కాజిగిరి సికంద్రాబాద్ రైల్వేస్టేషన్ల మద్య నిర్మాణ పనులు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News